
US Secretary: భారత్‌కు రానున్న యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి
దిల్లీ: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ ఈ నెల 27వ తేదీన భారత్‌కు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌తో దిల్లీలో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. బ్లింకెన్ పర్యటనతో భారత్-అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
కరోనా మహమ్మారి చెర నుంచి బయటపడేందుకు చేపట్టే చర్యలు, ఇండో-పసిఫిక్ అంశం, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులతోపాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరగనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆంటొనీ బ్లింకెన్ మొదటిసారి భారత్‌కు రానున్నారు. జులై 26 నుంచి 29 వరకు విదేశాల పర్యటనలో భాగంగా.. బ్లింకన్ 27న భారత్‌కు వచ్చి 28న కువైట్‌కు వెళ్లనున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రిన్స్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.