Biden: చైనాకు మరో షాకు ఉంటుందా..?
బైడెన్ సర్కారు నేడు మరో 10 చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన, షింజియాంగ్‌లో హైటెక్ నిఘా పరికరాలు పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది.
ఇంటర్నెట్‌డెస్క్: మరో 10 చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టడాన్ని నిషేధిస్తూ బైడెన్ సర్కారు నేడు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన, షింజియాంగ్‌లో హైటెక్ నిఘా పరికరాలు పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. గత నెలలో కొన్ని కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. మానవ హక్కుల విషయంలో చైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేసేందుకు బైడెన్ సర్కారు ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీనిపై చైనా శుక్రవారం స్పందించింది.
‘‘మా కంపెనీల హక్కులు, అవసరాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొన్నాం. మా అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యాన్ని ఏ మాత్రం ఆమోదించం’’ అని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. ఈ జాబితాల విషయాన్ని ఇప్పుడే అమెరికా బయటకు వెల్లడించలేదు. దీనిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ వెంటనే దీనిపై స్పందించలేదు. భవిష్యత్తులో మరిన్ని దేశాల కంపెనీలను ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉంది.
ట్రంప్ హయాంలో మొత్తం 31 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. బైడెన్ వచ్చిన తర్వాత మరో 28 కంపెనీలను అందులో చేర్చారు. ముఖ్యంగా నిఘా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని వీటిపై ఆరోపణలు చేసింది. చైనాలో షింజియాంగ్ ప్రావిన్స్‌లో దాదాపు 12 మిలియన్ల మంది వీఘర్లు ఉంటున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ చైనా వీరిని నిర్బంధిస్తోంది. వీరందరినీ రీ ఎడ్యుకేషన్ క్యాంపులుగా చెప్పే జైళ్లలోకి తరలిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల ఆధారంగా చైనా వీఘర్లపై ఇప్పటికే బలమైన నిఘా ఉంచింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Video games: వీడియో గేమ్స్‌తో పిల్లల విజ్ఞాన సముపార్జన దెబ్బతినదు
-
Crime News
Andhra News: అనాథ దళిత యువతిపై వాలంటీరు అత్యాచారం
-
Ts-top-news News
TS EAMCET: ఇంటర్ ఫస్టియర్‌లో 70% సిలబస్ నుంచే ఎంసెట్ ప్రశ్నలు
-
India News
Surrogacy: ‘సరోగసీ అమ్మకు.. జన్మించే బిడ్డతో జన్యుపరమైన బంధం ఉండదు’
-
Crime News
Harassment: చిట్టి ‘ఆయా’కు దంపతుల చిత్రహింసలు
-
Movies News
Raveena Tandon: అక్షయ్‌తో బ్రేకప్.. దాదాపు పాతికేళ్ల తర్వాత పెదవి విప్పిన నటి