Afghan Crisis: తాలిబన్లకు అమెరికా మరో షాక్‌..!

అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకు అమెరికా మరో షాక్‌ ఇచ్చింది. అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వానికి ఆయుధాల విక్రయాలను నిలిపివేయాలని......

Published : 19 Aug 2021 19:04 IST

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకు అమెరికా మరో షాక్‌ ఇచ్చింది. అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వానికి ఆయుధాల విక్రయాలను నిలిపివేయాలని బైడెన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిఫెన్స్‌ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే ఆఫ్గాన్‌కు పంపకుండా పెండింగ్‌లో ఉన్న, ఇంకా పంపిణీ చేయని ఆయుధాల బదిలీని సమీక్షించనున్నట్టు అమెరికా రాజకీయ/మిలటరీ వ్యవహారాల బ్యూరో ఓ ప్రకటనలో పేర్కొంది. అఫ్గానిస్థాన్‌లో శరవేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ శాంతి, జాతీయ భద్రత, అమెరికా విదేశాంగ విధానం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్న, ఎగుమతి చేసిన ఆయుధాల లైసెన్సులను ఆమోదాన్ని డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సేల్స్ కంట్రోల్స్ సమీక్షిస్తోందని తెలిపింది. రాబోయే రోజుల్లో రక్షణ సంబంధిత పరికరాల ఎగుమతిదారుల కోసం ప్రత్యేక మార్పుల సమాచారం జారీచేయనున్నట్టు తెలిపింది.

మరోవైపు, ఇప్పటికే అఫ్గాన్‌కు సంబంధించిన సుమారు రూ.70,500 కోట్లు (950 కోట్ల డాలర్లు) నిధులను అమెరికా స్తంభింపజేసిన విషయం తెలిసిందే. తాలిబన్ల చేతికి నిధులుఅందకుండా చేసేందుకు ప్రత్యేక ఆంక్షలు పెట్టింది. తాలిబన్లపై ఒత్తిడి తెచ్చేందుకు మరిన్ని చర్యల్లో భాగంగా ఇప్పుడు ఆయుధాల విక్రయాలను నిలిపివేయడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని