United States: అమెరికా వెళ్లేందుకు పర్యాటకులకు అనుమతి
కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా దశలవారీగా సడలిస్తోంది. ఇటీవల వాయుమార్గాన్ని తెరిచిన అగ్రరాజ్యం......
వాషింగ్టన్: కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా దశలవారీగా సడలిస్తోంది. ఇటీవల వాయుమార్గాన్ని తెరిచిన అగ్రరాజ్యం.. దాదాపు 19నెలల తర్వాత సరిహద్దులను తెరవనుంది. ఇప్పటివరకు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణికులను అనుమతించని అమెరికా.. ఇకపై ఎలాంటి కారణాలు లేకపోయినా అనుమతించనుంది. ఈ మేరకు బుధవారం నూతన నిబంధనలు ప్రకటించించింది. ఈ కొత్త నిబంధనలు నవంబరు నుంచి అమల్లోకి రానున్నాయి.
అయితే ప్రయాణికులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకోవాలని.. అలాంటి వారికి క్వారంటైన్ అవసరం ఉండదని స్పష్టం చేసింది. ప్రయాణికులు టీకా ధ్రువపత్రం, కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రాలు తీసుకురావాలని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు పొందిన ఏ వ్యాక్సిన్ తీసుకున్నా అనుమతించనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది.
కొవిడ్ విజృంభణ కారణంగా గతేడాది మార్చిలో కెనడా, మెక్సికో దేశాలతో ఉన్న సరిహద్దులను అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. దీంతో ఆయా దేశాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఈ సరిహద్దులు తెరుచుకోనుండటంతో పర్యాటకం మళ్లీ పుంజుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ
-
General News
Viveka Murder case: మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐ విచారణకు సహకరిస్తా: అవినాష్‌రెడ్డి
-
India News
Mughal Gardens: మొఘల్ గార్డెన్స్.. ఇక ‘అమృత్ ఉద్యాన్’