యూఎస్‌ కరోనా మరణాలు:3 యుద్ధాలతో సమానం

యూఎస్‌లో కరోనా మహమ్మారి మరణాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో తొలి మరణం నమోదైనప్పటి నుంచి నేటి వరకు మహమ్మారికి బలైన వారి సంఖ్య 5లక్షలకు చేరింది. ఈ మేరకు జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ గణాంకాలు సోమవారం వెల్లడించాయి.

Updated : 23 Feb 2021 17:25 IST

వాషింగ్టన్‌: యూఎస్‌లో కరోనా మహమ్మారి మరణాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో తొలి మరణం నమోదైనప్పటి నుంచి నేటి వరకు మహమ్మారికి బలైన వారి సంఖ్య 5లక్షలకు చేరింది. ఈ మేరకు జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ గణాంకాలు సోమవారం వెల్లడించాయి. అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం, కొరియా, వియత్నాం యుద్ధాల్లో మొత్తం ఎంత మంది మరణించారో.. కొవిడ్‌ కారణంగా ఒక్క ఏడాదిలో అంతమంది మరణించినట్లు పేర్కొంది. 

మహమ్మారికి బలైన అమెరికన్లకు సంతాపంగా శ్వేత సౌధంలో అధ్యక్షుడు బైడెన్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. రాబోయే ఐదు రోజుల పాటు ఫెడరల్‌ భవనాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆయన ఆదేశించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 2.5మిలియన్ల మంది మరణించారు. అందులో 20శాతం మరణాలు అమెరికావే కావడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిన నేపథ్యంలో అందరూ మాస్కు, సామాజిక దూరం పాటించడం కొనసాగించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

యూఎస్‌లో రెండో ప్రపంచ యుద్ధంలో 4.05లక్షల మంది మరణించారు. ఆ తర్వాత వియత్నాం యుద్ధంలో 58వేల మంది, కొరియన్‌ వార్‌లో 36వేల మంది మరణించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని