మీ దగ్గర్లోని వ్యాక్సిన్‌ కేంద్రాన్ని తెలుసుకోవచ్చిలా.. 

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం రెండో దశకు చేరుకుంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికీ వ్యాక్సిన్‌ అందించనుంది. ఈ నేపథ్యంలో

Updated : 02 Mar 2021 05:16 IST

పూర్తి వివరాలను అందిస్తున్న మాప్‌మై ఇండియా యాప్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం రెండో దశకు చేరుకుంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికీ వ్యాక్సిన్‌ అందించనుంది. ఈ నేపథ్యంలో దేశంలో మొత్తం 10 వేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్‌ చేపడుతున్నారు. మరో 20 వేల ప్రైవేటు కేంద్రాల్లో డోసుకు రూ.250 చొప్పున అందిస్తున్నారు. భవిష్యత్తులో వ్యాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్య పెరగనుంది. టీకా తీసుకొనే ప్రజలు వారికి దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని వీలుగా కనుగొనేందుకు గాను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌ cowin.gov.in మ్యాప్‌ మై ఇండియా యాప్‌తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు మ్యాప్‌ మై ఇండియా సంస్థ సీఈవో రోహన్‌ వర్మ సోమవారం ప్రకటించారు. స్వదేశీ యాప్‌ అయిన ఈ మ్యాప్‌మై ఇండియాలో దేశవ్యాప్తంగా ఉన్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లు, పరీక్షా కేంద్రాలు, ఐసొలేషన్‌ సెంటర్లు, కంటైన్మెంట్ జోన్లు అన్నింటిని ఆ యాప్‌లో వివరంగా చూపిస్తుందని రోహన్‌ తెలిపారు. 

ఎలా చూడాలంటే..

ముందుగా మ్యాప్‌మై ఇండియా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. లేదా ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ లేదా కోవిన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడున్న సెర్చ్‌ బాక్స్‌లో మీరున్న ప్రాంతం పేరు లేదా చిరునామా టైప్‌ చేయాలి. తర్వాత సెర్చ్‌ అని ప్రెస్‌ చేయాలి. వెంటనే మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలను మీకు చూపిస్తుంది. మీకు ఆయా కేంద్రాలకు వెళ్లే దారిని కూడా ఈ యాప్‌లో చూడవచ్చు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని