Tokyo Olympics: యూపీ అథ్లెట్లకు యోగి బంపర్‌ ఆఫర్‌ 

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులకు యూపీ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తమ రాష్ట్రం నుంచి పాల్గొనే క్రీడాకారులు.....

Published : 13 Jul 2021 20:37 IST

లఖ్‌నవూ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులకు యూపీ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తమ రాష్ట్రం నుంచి పాల్గొనే క్రీడాకారులు ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో (వ్యక్తిగత కేటగిరీ) బంగారు పతకం సాధిస్తే రూ.6కోట్లు ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. టీమ్‌ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకం సాధిస్తే విజేత జట్టులో ఒక్కొక్కరికి రూ.3కోట్లు చొప్పున  భారీ నజరానా ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనే 10మంది క్రీడాకారులకు రూ.10లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. ఈ నెల 23 నుంచి జపాన్‌లోని టోక్యో నగరంలో ఒలింపిక్స్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 

మరోవైపు, టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించే అవకాశం దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌, జాతీయ పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్‌ సింగ్‌లకు దక్కిన విషయం తెలిసిందే. రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరిస్తాడు. గత ఒలింపిక్స్‌ వరకు ఆరంభ వేడుకల్లో ఒక అథ్లెట్‌కే ఈ అవకాశం దక్కింది. అయితే ఈసారి నుంచి పురుషుల్లో ఒకరు, మహిళల్లో ఒకరు పతాకధారిగా ఉండేలా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిబంధనలు మార్చడంతో భారత ఒలింపిక్‌ కమిటీ (ఐఓఏ) ఇద్దరిని పతాకధారులుగా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని