ఉత్తరాఖండ్‌: మరో మూడు మృతదేహాల లభ్యం

ఉత్తరాఖండ్‌ దుర్ఘటనలో మృతుల సంఖ్య సోమవారం ఉదయం నాటికి 53కు పెరిగింది.

Published : 15 Feb 2021 14:39 IST

53కు చేరిన మృతుల సంఖ్య

తపోవన్‌: ఉత్తరాఖండ్‌ దుర్ఘటనలో మృతుల సంఖ్య సోమవారం ఉదయం నాటికి 53కు పెరిగింది. ఈ ఉదయం ఎన్టీపీసీ తపోవన్‌ ప్రాజెక్టు ప్రాంతంలోని అదిత్‌ సొరంగం వద్ద మరో మూడు మృతదేహాలు బయటపడినట్లు జిల్లా కలెక్టర్‌ స్వాతి బదౌరియా వెల్లడించారు. హిమనీ నదంలో నుంచి భారీ మంచు పెళ్లలు విరిగి ధౌలిగంగా నదిలో పడటంతో ఫిబ్రవరి 7న తపోవన్‌ ప్రాంతంలో మెరుపు వరదలు  చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో అక్కడ కొనసాగుతున్న హైడల్‌ ప్రాజెక్టు సొరంగాల్లో పలువురు చిక్కుకుపోయారు.

సొరంగాల్లో ఉన్న వారిని కనిపెట్టేందుకు కెమెరా లేదా పైపును ప్రవేశపెట్టేలా ప్రయత్నాలకు.. నీరు, బురద అడ్డుపడటంతో ప్రస్తుతం ఎస్కవేటర్లతో మాత్రమే సహాయక చర్యలను కొనసాగించగలుగుతున్నామని ఆమె వివరించారు. శనివారం పూర్తయిన తవ్వకం పనుల్లో కూడా.. కెమెరాను ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదన్నారు.

ఈ దుర్ఘటనలో గల్లంతైన వారిలో ఇంకా 150 మంది ఆచూకీ లభించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. బయట పడ్డ మృతదేహాల డీఎన్‌ఏ నమూనాల సేకరణ తదితర కార్యక్రమాల అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పాంగ్‌ గ్రామం మినహాయించి సంబంధిత గ్రామాలన్నిటిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ప్రభావిత  గ్రామాల ప్రజలకు ఆహారం తదితర అత్యవసరాలతో కూడిన రేషన్‌ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌  తెలిపారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు పరిహార చెక్కులను కూడా అందచేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి..

టూల్‌కిట్‌ కేసు: మరో ఇద్దరిపై అరెస్టు వారెంట్‌

 కమలా హారిస్‌ ఇమేజ్‌ వాడుకోవటం ఆపండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని