- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు అందజేశారు. శుక్రవారం ఉదయం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తీరత్ సింగ్ తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా ఉండేందుకే తీరత్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే తీరత్ సింగ్ రాజీనామాకు సిద్ధం కావడం గమనార్హం.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆరు నెలల్లోపే ఆయన శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ప్రస్తుతం నాలుగు నెలలు పూర్తికాగా.. సెప్టెంబర్ 10 నాటికి ఆరు నెలలు అవుతుంది. అయితే, రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ఉప ఎన్నికలు జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గడువు ముగిసేవరకు ఇలాగే పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే రాజీనామా చేయడమే ఉత్తమ మార్గమని భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో సొంత పార్టీ నుంచే తీరత్ సింగ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా భిన్న కారణాల నేపథ్యంలో తీరత్ సింగ్ గత మూడు రోజులుగా దిల్లీలోనే మకాం వేశారు. పలుసార్లు భాజపా పెద్దలతో భేటీ అయిన అనంతరం రాజీనామాకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీరత్ సింగ్ రావత్ గర్వాల్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా భాజపా ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. అందులో భాగంగానే తీరత్ సింగ్ రావత్‌తో రాజీనామా చేయించి, సిట్టింగ్ అభ్యర్థికి సీఎం పగ్గాలు అప్పజెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Botsa: 2 ఫొటోల అప్లోడ్ కోసం బోధన ఆపేస్తారా?
-
Ap-top-news News
Andhra News: మొన్న ‘రెడ్డి’.. ఈసారి ‘గోవిందా’!: ఏపీ మంత్రికి తప్పని పేరు ఘోష..
-
Crime News
Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
-
World News
Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్‌కు మంచిది!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- Kejriwal: ‘ఆప్‌ని గెలిపిస్తే..’ గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు