ఉత్తరాఖండ్‌ వరదలు: దిల్లీకి ఎఫెక్ట్‌ ..

ఉత్తరాఖండ్‌ వరదలు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిల్లీని కూడా ప్రభావితం చేస్తున్నాయి. వరదల వల్ల దేశ రాజధానిలోని వేల సంఖ్యలో నివాసితులకు నీటి సరఫరా నిలిచిపోయింది. హిమనీ నదంలో నుంచి భారీ మంచు పెళ్లలు విరిగి ధౌలిగంగా నదిలో పడటంతో  ఫిబ్రవరి 7 నుంచి ఉత్తరాఖండ్‌లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని రిషిగంగా లోయ దిల్లీకి ఈశాన్య దిశలో 530 కిలోమీటర్ల దూరంలో ఉంది...

Published : 16 Feb 2021 01:36 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌ వరదలు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిల్లీనీ ప్రభావితం చేస్తున్నాయి. వరదల వల్ల దేశ రాజధానిలోని వేల సంఖ్యలో నివాసితులకు నీటి సరఫరా నిలిచిపోయింది. హిమనీ నదంలో నుంచి భారీ మంచు పెళ్లలు విరిగి ధౌలిగంగా నదిలో పడటంతో  ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్‌లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని రిషిగంగా లోయ దిల్లీకి ఈశాన్య దిశలో 530 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ నది దేశ రాజధానికి కీలకమైన నీటి వనరు. వరదలు రావడంతో నీటిలో అధిక మొత్తంలో మట్టి, శిథిలాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజాధానిలో నీటి సరఫరా కొంతమేరకు నిలిచిపోయింది. పూర్తిస్థాయిలో నీటి సరఫరా అందించలేమని అధికారులు తెలిపారు.

మురికి నీటి కారణంగా నగరంలోని రెండు ప్రధాన నీటి శుద్ధి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. నివాసితులు అవసరాల మేరకు నీటిని వాడాలని దిల్లీ నీటి బోర్డు వైస్‌ ఛైర్మన్‌ రాఘవ్‌ చాధా తెలిపారు. వరదల వల్ల లోయ గుండా విద్యుత్  సరఫరా ఆగిపోయింది.  రోడ్లు, వంతెనలు నాశనమయ్యాయి.  కాగా 60 శాతం యమునా, 34 శాతం గంగా నది నుంచి దిల్లీకి నీటి సరఫరా అవుతోంది. వేసవిలో దేశ రాజధానికి తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.  కాగా ఈ వరదల వల్ల ఇప్పటికే 53 మంది మరణించారు. మరో 150 మంది ఆచూకీ తెలియలేదని అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు