Chardham: ‘చార్‌ధామ్‌ యాత్ర భక్తుల సంఖ్యపై పరిమితి ఎత్తివేయాలి’

చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని, ఇది కుదరని పక్షంలో మరింత మందిని అనుమతించాలని కోరుతూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. గత నెలలో చార్‌ధామ్‌ యాత్రపై స్టే ఎత్తివేసిన కోర్టు.. కొవిడ్‌ను దృష్టిలో...

Published : 02 Oct 2021 19:16 IST

దెహ్రాదూన్‌: చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని, ఇది కుదరని పక్షంలో మరింత మందిని అనుమతించాలని కోరుతూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. గత నెలలో చార్‌ధామ్‌ యాత్రపై స్టే ఎత్తివేసిన కోర్టు.. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్యపై పరిమితి విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బద్రీనాథ్‌కు రోజుకు వెయ్యి మంది భక్తులు, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఈ ఆంక్షలు సడలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరణ దరఖాస్తు దాఖలు చేసింది. పరిమితిని పూర్తిగా తొలగించలేని పక్షంలో.. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌కు రోజుకు మూడు వేల మంది భక్తులను, గంగోత్రికి వెయ్యి మందిని, యమునోత్రికి 700 మందిని అనుమతించాలని కోరింది. ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన ఈ యాత్ర నవంబరు మధ్య వరకే కొనసాగుతుందని, ప్రస్తుతం భక్తుల సంఖ్యపై పరిమితి కారణంగా యాత్రికులపై ఆధారపడి ఉన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని