తొలి డోస్‌ తీసుకున్నా..కుంభమేళాకు ఎంట్రీ! 

వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్న యాత్రికులు సైతం హరిద్వార్‌లో నిర్వహించే కుంభమేళాకు వచ్చేందుకు ఉత్తరాఖండ్ హైకోర్టు అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో యాత్రికులు కరోనా ‌టెస్టు చేసుకొని రావాలని

Updated : 31 Mar 2021 23:50 IST

హరిద్వార్‌: వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్న యాత్రికులు సైతం హరిద్వార్‌లో నిర్వహించే కుంభమేళాకు వచ్చేందుకు ఉత్తరాఖండ్ హైకోర్టు అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో యాత్రికులు కరోనా ‌టెస్టు చేసుకొని రావాలని ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే కుంభమేళా ఒక నెలపాటే జరగనుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి  తక్కువ సమయం ఉండటంతో టీకా తొలి డోస్‌ తీసుకున్నవారు సైతం కుంభమేళాకు రావొచ్చునని కోర్టు తాజాగా వెల్లడించింది. 

ఇదిలా ఉంటే..  భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచాలని కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తోంది. ఈ క్రమంలో రోజూ సుమారు 50 వేల కొవిడ్‌ టెస్టులు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఈ మేరకు పుణ్యస్నానాల సమయంలో భక్తులు తప్పనిసరిగా కరోనా నియమాలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 30 వరకు కుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని