Resort murder: ‘ఆధారాలు నాశనం చేసేందుకే రిసార్టు కూల్చివేత’..!

ఉత్తరాఖండ్‌లో కొద్దిరోజులుగా కనిపించకుండా పోయి, శవమై తేలిన యువతి హత్యకేసు దర్యాప్తు మలుపులు తిరుగుతోంది. 

Updated : 25 Sep 2022 15:19 IST

మృతురాలి కుటుంబీకుల ఆరోపణ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరాఖండ్‌లో కొద్దిరోజులుగా కనిపించకుండా పోయి, శవమై తేలిన యువతి హత్యకేసు దర్యాప్తు మలుపులు తిరుగుతోంది. ఆ యువతి నీట మునిగి చనిపోయినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక పేర్కొంది. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఈ నివేదకను విడుదల చేసింది. చనిపోవడానికి ముందు ఎవరో తీవ్రంగా కొట్టినట్లు ఆధారాలు ఉన్నాయని దానిలో పేర్కొన్నారు. మరోవైపు పోస్టుమార్టం తుది నివేదిక వచ్చేవరకూ అంత్యక్రియలు నిర్వహించమని బాధితురాలి తండ్రి తేల్చిచెప్పారు.

సదరు యువతి కనిపించకుండా పోయిన ఆరు రోజుల తర్వాత శనివారం రిషికేశ్‌ వద్ద చీలా కాల్వలో ఆమె మృతదేహం బయటపడింది. ఆమె మృతదేహానికి ఎయిమ్స్‌లోని నలుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఆమె గాయాలకు సంబంధించిన వివరాలు తుది నివేదికలో ఉండొచ్చని భావిస్తున్నారు.

రిసార్టు కూల్చివేతపై సందేహాలు..

యువతి పనిచేసే రిసార్టు భవనం అక్రమ నిర్మాణమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దానిని కూల్చివేసింది. ఈ చర్యను మృతురాలి కుటుంబీకులు తప్పుపట్టారు. ఆధారాలను నాశనం చేసేందుకే ఈ చర్యను చేపట్టారని పేర్కొన్నారు. 

ఈ కేసులో ప్రధాన నిందితుడు పులకిత్‌ తండ్రి.. హరిద్వార్‌లో భాజపా కీలక నేత అయిన వినోద్‌ ఆర్యను, ఆయన మరో కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి హామీ ఇచ్చారు. ఈ కేసులో శుక్రవారం పులకిత్‌తో పాటు.. రిసార్టులో పనిచేస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని