Kedarnath: కేదార్‌నాథ్ ఆలయ పూజారుల ఆందోళన.. రాష్ట్రపతికి రక్తంతో లేఖలు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ పూజారులు తమ ఆందోళన ఉద్ధృతం చేశారు. తమ నిరసనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ థామికి రక్తంతో లేఖలు రాశారు.....

Published : 18 Aug 2021 23:17 IST

కేదార్‌నాథ్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ పూజారులు తమ ఆందోళన ఉద్ధృతం చేశారు. తమ నిరసనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ థామికి రక్తంతో లేఖలు రాశారు. కేదార్‌నాథ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలంటూ దేవాలయంలోని ధమ్ సాకేత్ బగాదీ, నితిన్ బగ్వాడీ పూజారులు రక్తంతో లేఖలు రాశారు. బోర్డును రద్దు చేసేంతవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కోరుతూ దాదాపు రెండు నెలలుగా అర్చకులు ఆందోళన చేస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేసినప్పటినుంచి తమ హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తున్నారు. వినూత్నరీతిలో పూజారులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. సాధువులతో కలిసి నిరసనలు చేస్తున్నారు. ఆలయం ఎదుట శీర్షాసనాలు వేస్తూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. తాజాగా రక్తంతో లేఖలు రాశారు. గతంలోనూ ఇలానే ప్రధాని మోదీకి రక్తంతో లేఖలు రాశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని