WHO: పిల్లలకు టీకా.. అంత ప్రాధాన్యం కాదు

చిన్నారులకు కరోనా టీకా వేయడం  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దృష్టిలో అంత ప్రాధాన్యం కాదని ఆ సంస్థకు చెందిన వ్యాక్సిన్ నిపుణురాలు కేట్ ఓబ్రియన్ తెలిపారు. చిన్న పిల్లలపై మహమ్మారి ప్రభావం అంత తీవ్రంగా ఉండదని.. ప్రాణాంతకం కూడా కాబోదని పేర్కొన్నారు.

Published : 05 Jun 2021 01:22 IST

జెనీవా: చిన్నారులకు కరోనా టీకా వేయడం  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దృష్టిలో అంత ప్రాధాన్యం కాదని ఆ సంస్థకు చెందిన వ్యాక్సిన్ నిపుణురాలు కేట్ ఓబ్రియన్ తెలిపారు. చిన్న పిల్లలపై మహమ్మారి ప్రభావం అంత తీవ్రంగా ఉండదని.. ప్రాణాంతకం కూడా కాబోదని పేర్కొన్నారు. అలాంటప్పుడు వారికి వ్యాక్సిన్ ఇవ్వడం అంటే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడమే తప్ప వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేయడం కాబోదని వ్యాఖ్యానించారు. పలు అభివృద్ధి చెందిన దేశాలు పిల్లలకు టీకాలు ఇవ్వడం ప్రారంభించిన నేపథ్యంలో ఆమె ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. పిల్లలను పాఠశాలలకు పంపేముందు వ్యాక్సినేట్‌ చేయడం కూడా అత్యవసరమేమీ కాదన్న కేట్‌.. పాఠశాలల్లో వారిని చూసుకునే సిబ్బందికి, ఉపాధ్యాయులకు ఇస్తే మేలన్నారు.

కెనడా, అమెరికాతోపాటు కొన్ని ఐరోపా దేశాలు ఇప్పటికే 12 నుంచి 15 ఏళ్లలోపు వారికి టీకాలు ఇస్తున్నాయి. పిల్లలకు, అవసరం లేనివారికి ఇచ్చే టీకాలను పేద దేశాలకు ఇవ్వాలని ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన వ్యాక్సిన్లలో ఒక్క శాతం మాత్రమే పేద దేశాలకు అందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని