Vaccination: ‘మార్చి నుంచి 12-14 ఏళ్లలోపు చిన్నారులకు టీకాలు..’

భారత్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలై నిన్నటితో ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని.. నేడు 15 ఏళ్లు, ఆపై వారందరి కోసం విస్తరించారు. ఇదే క్రమంలో దేశంలో 12 నుంచి 14 ఏళ్లలోపు...

Published : 17 Jan 2022 17:22 IST

దిల్లీ: భారత్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలై నిన్నటితో ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని.. నేడు 15 ఏళ్లు, ఆపై వారందరి కోసం విస్తరించారు. ఇదే క్రమంలో దేశంలో 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే ప్రక్రియ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్‌ టెక్నికల్‌ ఆడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌(ఎన్‌టీఏజీఐ)కి చెందిన కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా సోమవారం తెలిపారు. అప్పటివరకు 15-18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జనవరి 3న 15-18 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ఈ వయస్సు బాలబాలికలు మొదటి డోస్ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం ట్వీట్ చేశారు. మరోవైపు 60 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రికాషన్‌ డోసుల పంపిణీ కొనసాగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని