Covaxin: 5-12 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్‌, కొర్బెవాక్స్‌ టీకాల వినియోగానికి సిఫార్సు

దేశంలో 5-12 ఏళ్ల పిల్లలకు గాను రూపొందించిన కొవాగ్జిన్‌, కొర్బెవాక్స్‌ కొవిడ్‌ టీకాల వినియోగానికి ‘ఎన్‌టాగీ’ స్టాండింగ్‌ టెక్నికల్‌ సబ్‌-కమిటీ (ఎస్‌టీఎస్‌సీ) సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈమేరకు భారత్‌ బయోటెక్‌కు

Updated : 09 Jul 2022 06:46 IST

దిల్లీ: దేశంలో 5-12 ఏళ్ల పిల్లలకు గాను రూపొందించిన కొవాగ్జిన్‌, కొర్బెవాక్స్‌ కొవిడ్‌ టీకాల వినియోగానికి ‘ఎన్‌టాగీ’ స్టాండింగ్‌ టెక్నికల్‌ సబ్‌-కమిటీ (ఎస్‌టీఎస్‌సీ) సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈమేరకు భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌, బయోలాజికల్‌-ఈ కి సంబంధించిన కొర్బెవాక్స్‌ టీకాల డేటాను జూన్‌ 16న నిర్వహించిన ఎస్‌టీఎస్‌సీ సమావేశంలో సభ్యులు సమీక్షించినట్లు వెల్లడించాయి. ఈ సందర్భంగా వీటి వినియోగానికి సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. దేశంలో ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందాన్ని ‘ఎన్‌టాగీ’గా వ్యవహరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని