Vaccination: లక్ష్యం చేరాలంటే.. 5 రెట్లు పెంచాలి!

వచ్చే డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రజలందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ లక్ష్యం చేరుకోవాలంటే దేశంలో రోజువారీ వ్యాక్సినేషన్‌ను 5 రెట్లు పెంచాల్సి ఉంటుందని ఓ ఆంగ్ల పత్రిక నివేదికలో తేలింది. ప్రస్తుత దేశ జనాభా, వ్యాక్సిన్‌ పంపిణీ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ముఖ్యంగా

Updated : 09 Jun 2021 20:00 IST

దిల్లీ: వచ్చే డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రజలందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ లక్ష్యం చేరుకోవాలంటే దేశంలో రోజువారీ వ్యాక్సినేషన్‌ను 5 రెట్లు పెంచాల్సి ఉంటుందని ఓ ఆంగ్ల పత్రిక తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత దేశ జనాభా, వ్యాక్సిన్‌ పంపిణీ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలని నివేదిక సూచిస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ఐదు నెలల్లో  12శాతం మంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు, 2.5 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. సరాసరి రోజుకు 1.4లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఈ రాష్ట్రంలో రోజుకు 13.2లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. బిహార్‌ విషయానికొస్తే ఇప్పటి వరకు 12.6శాతం మంది ప్రజలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకోగా.. 2.5 శాతం మంది మాత్రమే రెండో డోసు వేయించుకున్నారు. ప్రస్తుతం రోజువారీ వ్యాక్సినేషన్‌ 78వేలుగా ఉండగా.. 8.4రెట్లు పెంచి అంటే రోజుకు 6.6లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలి. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 38.1శాతం ప్రజలకు వ్యాక్సిన్లు ఇచ్చింది. అయితే, 7.9శాతం మందే రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 18వేల మందికి వ్యాక్సినేషన్‌ చేపడుతుండగా.. ఆ సంఖ్యను 41వేలకు పెంచాల్సిన అవసరముంది. మహారాష్ట్రలో వ్యాక్సినేషన్‌ను 4.5రెట్లు పెంచాలి. 

కేరళలో అయితే వ్యాక్సినేషన్‌ 31శాతం పూర్తి కాగా.. రెండు డోసులు వేయించుకున్నది కేవలం 8.1శాతం మాత్రమే. అయితే, డిసెంబర్‌ నాటికి ప్రజలందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను 2.8రెట్లు పెంచితే సరిపోతుంది. మొత్తంగా అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను 5.. అంతకంటే ఎక్కువ రెట్లు పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని