Corona: డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై కన్నేసి ఉంచాం: పాల్‌

దేశ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుతున్న క్రమంలో  డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై ఓ కన్నేసి ఉంచామని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకేపాల్ వెల్లడించారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా వేగవంతమవుతుందని అన్నారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను  సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని..

Published : 15 Jun 2021 21:02 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుతున్న క్రమంలో  డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై ఓ కన్నేసి ఉంచామని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకేపాల్ వెల్లడించారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా వేగంగా కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను  సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్ గత మార్చి నుంచే ప్రభావం చూపిస్తోందని, దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీకేపాల్‌ అభిప్రాయపడ్డారు. ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 (INSACOG) ద్వారా వైరస్‌ ఉనికిని కనిపెట్టాలన్నారు. ప్రస్తుతం ఈ వైరస్‌ వేరియంట్‌ వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉందన్నారు. ‘‘ మన దేశంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరోనా వేరియంట్‌ 2020లో వ్యాప్తి చెందిన వైరస్‌ కంటే చాలా వేగంగా విస్తరించింది. భవిష్యత్‌లో ఎలాంటి వేరియంట్లు పుట్టుకొచ్చినా ఎదుర్కొనేందుకు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. వైరస్‌ ప్రవర్తనను అంచనా వేసి దానికి అనుగుణంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని