Vaccination: పెద్దల్లో టీకాలు మంచి ఫలితాలనిస్తున్నాయి..

కొవిడ్‌-19 నుంచి ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యల నుంచి టీకాలు సమర్థవంతమైన రక్షణ ఇస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. ఫ్రాన్స్‌లో ఇపి-ఫారె అనే మెడిసిన్‌ సేఫ్టీ రీసెర్చి సంస్థ నిర్వహించిన అతిపెద్ద పరిశోధనలో దీనిని పరిశోధకులు

Published : 11 Oct 2021 23:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌-19 నుంచి ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యల నుంచి టీకాలు సమర్థవంతమైన రక్షణ ఇస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. ఫ్రాన్స్‌లో ఇపి-ఫారె అనే మెడిసిన్‌ సేఫ్టీ రీసెర్చి సంస్థ నిర్వహించిన అతిపెద్ద పరిశోధనలో దీనిని పరిశోధకులు గుర్తించారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో కలిసి ఈ సంస్థ పనిచేసింది. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం విడుదల చేశారు. తీవ్రమైన కొవిడ్‌ సమస్యల నుంచి, మరణాల నుంచి, ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా లభించే రక్షణపై ఈ పరిశోధన దృష్టిపెట్టింది.  50 ఏళ్లు దాటి టీకాలు తీసుకొన్న 22 మిలియన్ల మంది వివరాలను పరిశీలించారు.వీరిలో 90శాతం ఆసుపత్రిలో చేరడం లేదా చనిపోవడం వంటి ముప్పుల నుంచి తప్పించుకొన్నారు. 

ఈపరిశోధనకు సంబంధించి డేటా సేకరణ గతేడాది డిసెంబర్‌లో మొదలైంది. అదే సమయంలో ఫ్రాన్స్‌లో టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. పరిశోధకులు  వ్యాక్సిన్‌ తీసుకొన్న 1.1 కోట్ల మంది డేటాను..  వ్యాక్సిన్‌ తీసుకోని 1.1 కోట్ల మంది డేటాతో పోల్చి చూశారు. ఇందుకోసం దీనిలో పాల్గొన్నవారి వయస్సు, ప్రాంతం వంటి అంశాల్లో ఒకే విధంగా ఉన్నవారిని గుర్తించి.. వారిలో టీకా తీసుకొన్నవారు.. టీకా తీసుకోని వారిని పోల్చి చూశారు. దీనిలో రెండో డోసు తీసుకొన్న తర్వాత 14 రోజుల నుంచి కొవిడ్‌ ముప్పు 90శాతం తగ్గిపోయింది. టీకా తీసుకోవడం వల్ల 75ఏళ్ల కంటే పైబడిన వారిలో కొవిడ్‌ సమస్యల ముప్పు 84శాతం తగ్గిపోగా.. 50 నుంచి 75 ఏళ్లలోపు వారిలో 92శాతం తగ్గిపోయింది. టీకాలు డెల్టావేరియంట్‌పై కూడా అదే సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ పరిశోధనలో ఫైజర్‌,మోడెర్నా,ఆస్ట్రాజెనికా టీకాలను మాత్రమే తీసుకొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని