డ్రైవింగ్‌ లైసెన్స్‌ వ్యాలిడిటీ పెంపు

కరోనా నేపథ్యంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌), రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (ఆర్సీ) తదితర ద్రువపత్రాల వ్యాలిడిటీని పెంచాల్సిందిగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరి 1, 2021 నుంచి మార్చి 31 మధ్య వ్యాలిడిటీ పూర్తయిన వారికే...

Published : 30 Mar 2021 01:21 IST

దిల్లీ: కరోనా నేపథ్యంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌), రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (ఆర్సీ) తదితర ద్రువపత్రాల వ్యాలిడిటీని పెంచాల్సిందిగా కేంద్ర రహదారి, రవాణా శాఖ సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరి 1, 2021 నుంచి మార్చి 31 మధ్య వ్యాలిడిటీ పూర్తయిన వారికే ఇది వర్తిస్తుంది. వీరందరికీ మరో మూడు నెలలపాటు వ్యాలిడిటీ పొడిగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే జూన్‌ 30వరకు వారి ద్రువపత్రాలు చెల్లుబాటు అవుతాయి.

ప్రస్తుత మోటార్‌ వెహికల్‌ చట్టం- 1988లోని నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ వ్యాలిడిటీ పూర్తయిన ఏడాదిలోపు ఎప్పుడైనా రెన్యువల్‌ చేసుకునే వీలుంది. అయితే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది ఆర్సీ, డీఎల్‌లను రెన్యువల్‌ చేసుకోలేకపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈమేరకు సూచించింది. గత ఏడాది మార్చి 30, జూన్‌ 9, ఆగస్టు 24, డిసెంబరు 27 తేదీల్లోనూ కేంద్రం ఇలాంటి సూచనలు జారీ చేసింది. మరోవైపు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేసే సమయంలో టెస్ట్‌ డ్రైవ్‌లను మరింత కఠినతరం చేయాలని జాతీయ రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో  స్పష్టం చేసిన విషయం తెలిసిందే. టెస్టు డ్రైవ్‌లో కచ్చితంగా పాసైన వారికే లైసెన్సు జారీ చేయాలని ఆయన అన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని