Vande bharat: వందే భారత్‌ రైలుకు మరో ప్రమాదం.. ఈసారి ఆవు వంతు

ముంబయి-గాంధీనగర్‌ మధ్య నూతనంగా ప్రారంభమైన ‘ వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. గాంధీనగర్‌ నుంచి ముంబయి వెళ్తున్న రైలు.. గుజరాత్‌లోని ఆనంద్‌ స్టేషన్‌ సమీపంలో ఓ ఆవును ఢీ కొట్టింది.

Published : 07 Oct 2022 19:42 IST

గాంధీనగర్‌: ముంబయి- గాంధీనగర్‌ మధ్య నూతనంగా ప్రారంభమైన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం బట్వా- మణినగర్ స్టేషన్‌ల మధ్య ఓ గేదెల గుంపును ఢీ కొనడంతో రైలు మందుభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ గాంధీనగర్‌ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గుజరాత్‌లోని ఆనంద్‌ స్టేషన్‌ సమీపంలో ఓ ఆవును ఢీ కొట్టింది. అయితే ఘటలో పెద్దగా నష్టమేమీ జరగలేదు. రైలు ముందుభాగంలో చిన్నపాటి గంటు ఏర్పడిందని పశ్చిమ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారి సుమిత్‌ ఠాకూర్‌ తెలిపారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ సెమీ- హైస్పీడ్ రైలును ప్రధాని మోదీ ఇటీవలే జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అక్టోబర్‌ 1 నుంచి ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని