Vande Bharat sleeper: వందేభారత్‌ స్లీపర్‌.. త్వరలో ట్రయల్‌ రన్‌

వందేభారత్‌ స్లీపర్‌ ట్రయల్‌ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అతి త్వరలో ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Published : 16 Jun 2024 00:04 IST

దిల్లీ: ప్రయాణికుల కోసం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ (Vande Bharat Express Sleeper) త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే.. ఈ రైళ్ల ట్రయల్‌ రన్‌ ప్రారంభం కానుంది. ఆగస్టు 15 నాటికి ట్రయల్‌ నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

దీంతో అతి త్వరలోనే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుని పట్టాలెక్కనుంది. ఇప్పటివరకు కూర్చొని ప్రయాణించేందుకు వీలుండే ఈ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను కేంద్రం అందించనుంది. ఇతర రైళ్లతో పోలిస్తే.. ఈ ప్రీమియం రైలులో మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్‌ చుక్‌ పరుగులు!

ఇప్పటికే సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛైర్‌కార్‌ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సర్వీసులను అందిస్తున్నాయి. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్రం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు