Indian Railway: ‘వందే భారత్‌’ రైలుకు ప్రమాదం!

ముంబయి- గాంధీనగర్‌ల మధ్య ఇటీవల నూతనంగా ప్రారంభించిన ‘వందే భారత్(Vande Bharat)‌’ రైలు ప్రమాదానికి గురైంది. గురువారం ఓ గేదెల మందను ఢీకొన్న ఘటనలో.. ట్రైన్‌ ముందు భాగం దెబ్బతింది.

Published : 06 Oct 2022 17:44 IST

గాంధీనగర్‌: ముంబయి- గాంధీనగర్‌ల మధ్య ఇటీవల నూతనంగా ప్రారంభించిన ‘వందే భారత్(Vande Bharat)‌’ రైలు ప్రమాదానికి గురైంది. గురువారం ఓ గేదెల మందను ఢీకొన్న ఘటనలో.. ట్రైన్‌ ముందు భాగం దెబ్బతింది. రైలు ముంబయి(Mumbai) నుంచి గాంధీనగర్‌(Gandhinagar)కు వెళ్తుండగా.. మార్గమధ్యలో బట్వా- మణినగర్ స్టేషన్‌ల మధ్య ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో 20 నిమిషాలపాటు రైలు అక్కడే నిలిచిపోయింది.

ఆ తర్వాత ఎప్పటిలాగే గాంధీనగర్‌కు బయలుదేరినట్లు అహ్మదాబాద్‌ రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. గాంధీనగర్- ముంబయి ‘వందే భారత్’ సెమీ- హైస్పీడ్ రైలును ప్రధాని మోదీ(PM Modi) ఇటీవలే జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వేస్టేషన్ వరకు అందులో ప్రయాణించారు. అక్టోబరు 1 నుంచి ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులో వచ్చాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts