BF7: బీఎఫ్7 వేరియంట్.. భారత్‌కు ఎందుకంత అప్రమత్తత?
డెల్టా, ఒమిక్రాన్ లాంటి వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ బీఎఫ్7 వ్యాప్తిపై ఆందోళన చెందుతోంది. ఒక్క చైనాలో తప్ప దీని వ్యాప్తి ఇతర దేశాల్లోనూ అంత ఉద్ధృతంగా లేనప్పటికీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎందుకో తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: చైనా (China)లో తీవ్ర రూపం దాల్చుతున్న బీఎఫ్.7 (BF.7) వేరియంట్ భారత్‌లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ కేవలం నాలుగు కేసులే నమోదైనప్పటికీ భారత ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ఇంతకుముందు డెల్టా (Delta), ఒమిక్రాన్ (Omicron) లాంటి వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ ఈ వేరియంట్ పట్ల అధికారులు ఎందుకంత ఆందోళన గురవుతున్నారు? అసలు ఈ వేరియంట్ లక్షణాలేంటి?
- బీఎఫ్ 7 ప్రధానంగా ఎగువ శ్వాసకోశ సమస్యలను సృష్టిస్తుంది. అంటే ఛాతీ పైభాగం, గొంతుపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు జ్వరం, జలుబు లాంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమై వ్యక్తి చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ.
- కొందరు వ్యక్తుల్లో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స చేసుకోవడం మంచిది. దీనివల్ల ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.
- భారత్‌లో కొన్ని రోజులుగా సాధారణ కరోనా కేసులు 200కు దిగువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. జులై- అక్టోబరు నెలల మధ్యలో 4 బీఎఫ్7 కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో మూడు గుజరాత్‌లో నమోదుకాగా.. ఒక కేసు ఒడిశాలో గుర్తించారు. అయితే ఈ నలుగురూ వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.
- గత వేరియంట్లతో పోల్చుకుంటే బీఎఫ్7 తీవ్రత అంత ఎక్కువేమీ కాదు. కానీ, వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్నందున అత్యధిక మందికి ఈ వైరస్ సోకే అవకాశముందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో ఇది ప్రవేశిస్తే.. ఇప్పటివరకు ఎదుర్కొన్న వేరియంట్ల కంటే దీని బారిన పడినవారు అధిక సంఖ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా బాధితులకు వైద్య సదుపాయాలు కష్టతరమవుతాయని చెబుతున్నారు.
- 2019లో కరోనా ప్రారంభంలో చైనా ఎదుర్కొన్న పరిస్థితులు ఒక ఎత్తయితే.. బీఎఫ్ 7తో ప్రస్తుతం అంతకుమించిన కష్టాలను ఆ దేశం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ వేరియంట్ భారత్‌లో వ్యాప్తి చెందితే పరిణామాలు ఎలా ఉంటాయోనని ప్రభుత్వం, వైద్యాధికారులు అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు.
- బీఎఫ్7 వేరియంట్ కేవలం చైనాలో మాత్రమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. అయితే చైనాలో ఉన్నంత ఉద్ధృతంగా ఇతర దేశాల్లో వ్యాప్తి చెందకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం.
- రెండు నెలల క్రితమే ఈ వేరియంట్ తమ దేశంలోకి వచ్చిందని గుర్తించిన ఇంగ్లాండ్.. పటిష్ఠ చర్యలతో దాని వ్యాప్తిని అడ్డుకోగలిగింది.
- చైనాలో బీఎఫ్ 7 వేరియంట్ వ్యాప్తి చెందడానికి అక్కడి ప్రజల వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటం కూడా ఓ కారణం కావొచ్చు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు కాకపోవడం కూడా ఈ వేరియంట్ వ్యాప్తికి దోహదం చేసి ఉండొచ్చని వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- ప్రపంచ దేశాల్లో బీఎఫ్7 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీతోపాటు పలువురు వైద్య అధికారులు తాజాగా దీనిపై తాజాగా సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. మాస్క్ ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు.
- బీఎఫ్7 వ్యాప్తి నేపథ్యంలో భారత్-చైనా మధ్య విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా 2 శాతం మంది నమూనాలను సేకరించి పరీక్ష చేయాలని నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..