Varun Gandhi: రోజుకు 14 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటుంటే..!

భాజపా ఎంపీ వరుణ్ గాంధీ గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అన్నదాతల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు.

Published : 19 Feb 2022 01:24 IST

దిల్లీ: భాజపా ఎంపీ వరుణ్ గాంధీ గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అన్నదాతల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. తాజాగా ఏబీజీ షిప్‌యార్డ్ బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై వరుణ్ ట్విటర్ వేదికగా స్పందించారు. అలాగే ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ గురించి ప్రస్తావించి, కేంద్రంపై మండిపడ్డారు   

‘విజయ్ మాల్యా.. రూ.9 వేల కోట్లు, నీరవ్ మోదీ.. రూ.14 వేల కోట్లు, రిషి అగర్వాల్‌..రూ.23 వేల కోట్ల బ్యాంకు మోసాలకు పాల్పడ్డారు. నేడు దేశంలో అప్పుల బాధతో రోజుకు సుమారు 14 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. ఆ ధనవంతులు మాత్రం విలాసవంతంగా జీవిస్తున్నారు. ఈ భారీ అవినీతిపై బలమైన ప్రభుత్వం.. బలమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు’ అని ప్రభుత్వ చర్యల్లో లోపాలను ఎత్తిచూపారు.

దర్యాప్తు సంస్థలు నీరవ్, విజయ్ మాల్యా ఆర్థిక నేరాలను వెలికితీసిన తర్వాతే వారు దేశం విడిచిపారిపోయారు. తాజాగా గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డు సంస్థ 28 బ్యాంకులను మోసం చేసి, సుమారు రూ.23 వేల కోట్ల మేర టోకరా పెట్టినట్లు తేలింది. నిందితులు దేశం విడిచి పారిపోకుండా దర్యాప్తు సంస్థలు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని