Published : 25/05/2021 23:45 IST

John Cena: చైనాకు జాన్‌  సీనా సారీ!

ఇంటర్నెట్‌డెస్క్‌: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌ జాన్‌ సీనా నోరుజారి అన్న మాటతో చైనాకు సారీ చెప్పాల్సి వచ్చింది. తాజాగా ఆయన నటించిన ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9’ విడుదల కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద సినీ మార్కెట్ అయిన చైనా ఆగ్రహానికి గురికాకుండా రాజీపడ్డారు. ఆయన మే నెల మొదట్లో చిత్ర ప్రచారం కోసం తైవాన్‌ సందర్శించారు. అక్కడ తైవాన్‌ను ఒక దేశంగా పేర్కొన్నారు. ఇది దౌత్య వివాదానికి తెరతీసింది. వాస్తవానికి తైవాన్‌ను చైనా తన దేశంలో స్వయంప్రతిపత్తి ఉన్న ఒక భాగంగా భావిస్తోంది. దీనిపై చైనా సోషల్‌ మీడియాలో దుమారం చెలరేగింది. దీంతో జాన్‌ సీనా స్పందించారు. 

ఆయన మంగళవారం చైనీయులకు క్షమాపణలు చెబుతూ విబో వేదికగా ఒక సందేశాన్ని రిలీజ్‌ చేశారు.‘‘ నేను ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9 చిత్ర ప్రచారంలో భాగంగా చాలా ఇంటర్వ్యూలు చేశాను. కానీ ఒక ఇంటర్వ్యూలో పొరబాటు దొర్లింది.  నాకు చైనా అన్నా.. చైనీయులన్నా చాలా ప్రేమ అని కచ్చితంగా చెబుతాను. నా తప్పునకు వెరీ వెరీ సారీ’’ అని పేర్కొన్నారు. మే 21న విడుదలైన  ఆ చిత్రం గత వారాంతానికి 148 మిలియన్‌ డాలర్లను వసూలు చేసినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది.  చైనాను విమర్శించే వ్యక్తులు, సంస్థలను ఆ దేశ మార్కెట్‌లోకి రాకుండా బీజింగ్‌ పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలానే ఎన్‌బీఏ బ్రాండ్‌తో పాటు ఫ్యాషన్‌ దిగ్గజాలు కూడా బాయ్‌కాట్‌ సమస్యను ఎదుర్కొంటున్నాయి.   

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని