Viral video: సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు.. వీడియో వైరల్‌

సిబ్బందిలో ఒకరిని మందలించిందనే కోపంతో ఓ వ్యక్తి ఒక యువతిని చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. 

Published : 28 Sep 2023 16:55 IST

అహ్మదాబాద్‌: సిబ్బందిలో ఒకరిని మందలించిందనే కోపంతో ఓ వ్యక్తి ఒక యువతిని చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

అహ్మదాబాద్‌ (Ahmedabad) పరిసర ప్రాంతాల్లో ఓ యువతి మొహ్సిన్‌ అనే వ్యక్తితో కలిసి మహిళా సెలూన్‌ను ఏర్పాటు చేశారు. కొంతకాలంగా ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలోనే వ్యాపారంలో రూ. 5 వేలు నష్టం వచ్చింది. దీంతో ఆ యువతి అనుమానంతో సెలూన్‌లో పని చేస్తున్న మరో అమ్మాయిని మందలించింది. ఈ విషయంపై మొహ్సిన్‌ తనను ఎందుకు తిట్టావ్‌ అంటూ ఆమెతో గొడవ దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆమె అక్కడ నుంచి బయటకు వచ్చింది.

యువతి వెనకే వెళ్లిన మొహ్సిన్‌ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు యువతి ముఖంపై కొట్టాడు. అతడిని ఆపేందుకు అక్కడున్న వారు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె మొహ్సిన్‌ను వెనక్కు నెట్టి తప్పించుకుంది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్థానిక పోలీసులు బాధితురాలిని ఈశాన్య ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు. ఆమె దగ్గరకు వెళ్లి  ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని