Supreme Court: విజయ్‌ మాల్యా.. నీకిదే లాస్ట్‌ ఛాన్స్‌..!

బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పరారైన విజయ్‌ మాల్యాకు భారత అత్యున్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది.

Updated : 11 Feb 2022 12:37 IST

కోర్టు ముందు హాజరు కావాలన్న సుప్రీం కోర్టు

దిల్లీ: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పరారైన విజయ్‌ మాల్యాకు భారత అత్యున్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో కోర్టు ముందు హాజరు అయ్యేందుకు రెండు వారాల గడువు ఇచ్చిన న్యాయస్థానం.. ఇది చివరి అవకాశం అని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 24కు వాయిదా వేసిన కోర్టు.. ఈలోగా కోర్టులో వ్యక్తిగతంగా లేదా ఆయన తరపున న్యాయవాది కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. హాజరుకాని పక్షంలో ఈ కేసు ముగింపునకు సంబంధించి తామే తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

2017లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. కుమారుడు, కుమార్తెలకు 40 మిలియన్‌ డాలర్లను మాల్యా బదిలీ చేశారంటూ ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం విజయ్‌ మాల్యాను కోర్టు ధిక్కరణ కింద దోషిగా తేలుస్తూ 2017 మే నెలలో తీర్పు వెలువరించింది. అప్పటికే లండన్‌ పారిపోయిన ఆయన.. తిరిగి భారత్‌కు రాలేదు. అదే సమయంలో విజయ్‌ మాల్యాను దివాలా దారుగా ప్రకటించిన లండన్‌ కోర్టు.. ఆయన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియంకు గతంలోనే అనుమతి ఇచ్చింది. అనంతరం రూ.వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే, పలు కారణాలు చెబుతోన్న విజయ్‌ మాల్యా.. అక్కడే తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని