Vijay Mallya: విజయ్‌ మాల్యా కుమారుడి వివాహం.. వారం రోజులు వేడుకలు

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా కుమారుడు సిద్ధార్థ్‌ వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని అతడు స్వయంగా ఇన్‌స్టాలో వెల్లడించాడు.

Published : 18 Jun 2024 11:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పరారీలో ఉన్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా కుమారుడి వివాహ వేడుకలు లండన్‌లో ఘనంగా మొదలయ్యాయి. ఈవిషయాన్ని సిద్ధార్థ్‌ మాల్యా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ప్రకటించాడు. ఈ సందర్భంగా ఫ్లవర్‌ ఫ్రేమ్‌లో తన ప్రియురాలు జాస్మిన్‌తో దిగిన ఫొటోను అతడు షేర్‌ చేశాడు. 

సిద్ధార్థ్‌ 2023లో జరిగిన హాలోవిన్‌ సంబరాల్లో జాస్మిన్‌కు ప్రపోజ్‌ చేశాడు. దీనికి సంబంధించిన చిత్రాలు జూనియర్‌ మాల్యా ఇన్‌స్టాలో ఉన్నాయి.  వీటిలో జాస్మిన్‌ మాంత్రికురాలి డ్రెస్‌లో ఉండగా.. సిద్ధార్థ్‌ హాలోవిన్‌ పంప్‌కిన్‌ డ్రెస్‌ ధరించాడు.

సిద్ధార్థ్‌ గతంలో నటుడు, మోడల్‌గా సుపరిచితమే. అతడు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జన్మించాడు. వెల్లింగ్టన్‌ కాలేజ్‌, క్వీన్స్‌మేరీ విశ్వవిద్యాలయాల్లో చదువుకొన్నాడు. రాయల్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ డ్రామాలో కోర్సు చేశాడు. అనంతరం మోడల్‌, యాక్టర్‌గా కెరీర్‌ మొదలుపెట్టాడు. అతడు మానసిక ఆరోగ్యంపై పుస్తకాలు కూడా రాశాడు. యువతలో వచ్చే మానసిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాడు. తాను జీవితంలో అనుభవించిన మానసిక పరిస్థితిపై కూడా ఓ పుస్తకం రచించాడు. 

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు అతడు డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ది హంట్‌ ఫర్‌ ది కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ గర్ల్‌ 2013కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని