Jammu and Kashmir: ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను బంధించిన గ్రామస్థులు

జమ్ము కశ్మీర్‌లోని ప్రజల్లో ఉగ్రవాదంపై మెల్లగా చైతన్యం వస్తోంది. తాజాగా ఆదివారం రెయిసీ జిల్లాలోని టక్సన్‌ గ్రామంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు

Updated : 03 Jul 2022 14:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్ము కశ్మీర్‌లోని ప్రజల్లో ఉగ్రవాదంపై క్రమంగా చైతన్యం వస్తోంది. తాజాగా ఆదివారం రెయిసీ జిల్లాలోని టక్సన్‌ గ్రామంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు బంధించి పోలీసులకు అప్పగించారు. వీరిలో లష్కరే కమాండర్‌ తాలిబ్‌ హుస్సేన్‌ కూడా ఉన్నాడు. ఇతను రాజౌరీ జిల్లాకు చెందినవాడు. ఇటీవల ఆ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుళ్ల వెనుక ఇతడి హస్తం ఉంది. మరో ఉగ్రవాది ఫైజల్‌ అహ్మద్‌ దార్ దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందినవాడు. ఇతడు మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రెండు ఏకే రైఫిల్స్‌, ఏడు గ్రనేడ్‌లు, పిస్తోల్‌ను స్వాధీనం చేసుకొన్నారు. వీరిద్దరిని పోలీసులకు అప్పగించారు. 

గ్రామస్థుల ధైర్య సాహసాలకు గుర్తింపుగా అడిషనల్‌ డీజీపీ రూ.2 లక్షల బహుమానాన్ని ప్రకటించారు. దీనికి అదనంగా రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా మరో రూ.5 లక్షలను గ్రామస్థులకు బహుమానంగా ప్రకటించినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని ఏడీజీపీ జమ్ము ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. టక్సన్‌ గ్రామస్థులకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని