
Published : 18 Nov 2021 01:47 IST
Puducherry: నడుములోతు నీళ్లలోనే శవయాత్ర!
పుదుచ్చేరి: చనిపోయిన ఓ వృద్ధుని అంత్యక్రియలు నిర్వహించేందుకు పుదుచ్చేరిలోని కురువినాథం గ్రామస్థులు పెద్ద సాహసమే చేశారు. నదిలో నడుములోతు నీళ్లల్లో శవాన్ని మోస్తూ తెన్‌పెన్నై నది ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు దాటారు. నది పొంగి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో కురువినాథం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి వెళ్లాలంటే నది దాటాల్సి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో పాడె మోసేవారంతా నడుములోతు నీటిలోనే నడుచుకుంటూ అవతలి వైపు వెళ్లారు. తెన్‌పెన్నై నదిపై వంతెన నిర్మించకపోవడంతో.. ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రతిసారీ ఇదే పరిస్థితి తలెత్తుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని విన్నవించారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :