Viral Video: ఈ కేఫ్‌కు ఆనంద్ మహీంద్రా 10 స్టార్ రేటింగ్.. ప్రత్యేకత ఏంటంటే..?
ఇంటర్నెట్‌డెస్క్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ సందేశాత్మక, స్ఫూర్తినిచ్చే అంశాల గురించి పోస్టులు చేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయన ఓ కేఫ్ వీడియోను పోస్ట్ చేశారు. దానికి ఏకంగా 10 స్టార్ రేటింగ్ ఇచ్చారు. మరి ఆ కేఫ్‌కు అంత ప్రత్యేకత ఏంటంటే.. దాన్ని నడుపుతున్నది మన భారత సైన్యం.
కశ్మీర్లో గురెజ్ వ్యాలీలో ఆర్మీ లాంగ్ హట్ పేరుతో ఓ కేఫ్‌ను నిర్వహిస్తోంది. ఎత్తైన మంచుకొండల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ అందమైన కేఫ్ గురించి గరిమా గోయల్ అనే బ్లాగర్ ఓ టూర్ వీడియో చేశారు. అక్కడ కూర్చుంటే ప్రకృతి ఒడిలో ఉన్నంత హాయిగా ఉందన్న ఆమె.. కేఫ్‌లోని పదార్థాలు కూడా ఎంతో రుచిగా ఉన్నాయని కితాబిచ్చారు. భారత సైన్యానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఈ కేఫ్‌ను సందర్శించాలని కోరారు.
ఈ వీడియో వైరల్ అవడంతో ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను షేర్ చేసిన మహీంద్రా.. ‘‘నా వరకు.. ఈ కేఫ్ 5 స్టార్, 7 స్టార్ కాదు.. ఏకంగా 10 స్టార్ విడిది’’ అని రాసుకొచ్చారు. మహీంద్రా ట్వీట్‌కు అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. కొందరైతే ఆర్మీ నడుపుతోన్న ఇతర కేఫ్‌లు, స్టోర్ల గురించి చెబుతూ పోస్టులు పెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?
-
General News
Andhra news: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్ల ఎత్తివేత
-
Sports News
Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
-
Crime News
Crime News: చేపల వేటకు వెళ్లి ఒకరు.. కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు గల్లంతు
-
Movies News
Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్
-
General News
Weight Loss: లావుగా ఉన్నామని చింతిస్తున్నారా...? ప్రత్యామ్నాయం ఉంది కదా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ
- Smoking In Plane: విమానంలో దర్జాగా పడుకొని సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్..!
- IT Jobs: ఐటీలో వలసలు తగ్గుతాయ్
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?