Viral Video: జవాన్లను చూడగానే నాలుగేళ్ల చిన్నారి ఏం చేశాడంటే..

నాలుగేళ్ల చిన్నారి తన తండ్రితో కలిసి విమానాశ్రయానికి వచ్చాడు. తండ్రి చేయి పట్టుకుని లోపలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అక్కడ కొందరు సీఐఎస్‌ఎఫ్‌

Published : 25 Oct 2021 16:31 IST

బెంగళూరు: నాలుగేళ్ల చిన్నారి తన తండ్రితో కలిసి విమానాశ్రయానికి వచ్చాడు. తండ్రి చేయి పట్టుకుని లోపలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అక్కడ కొందరు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు విధులు నిర్వహిస్తూ కన్పించారు. దీంతో వెళ్తున్న ఆ చిన్నారి ఒక్క క్షణం ఆగాడు. తండ్రి చేయి వదిలిపెట్టి జవాన్ల వైపు తిరిగి వారికి సెల్యూట్‌ చేశాడు. ఈ ఊహించని పరిణామంతో జవాన్లే కాదు అక్కడున్నవారంతా క్షణకాలం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జవాన్లు కూడా చిరునవ్వుతో చిన్నారి సెల్యూట్‌ చేశారు. ఈ అద్భుత దృశ్యానికి బెంగళూరు ఎయిర్‌పోర్టు వేదికైంది.

అక్టోబరు 18న జరిగిందీ ఘటన. ఆ చిన్నారి పేరు వీర్‌ అర్జున్‌. వీర జవాన్లకు సెల్యూట్‌ చేస్తుండగా.. తన తల్లి వీడియో రికార్డ్‌ చేశారు. ఆ వీడియోను వీర్‌ తండ్రి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తాజాగా ఈ వీడియోను రీ-పోస్ట్‌ చేస్తూ.. చిన్నారిపై ప్రశంసలు కురిపించారు. దేశభక్తి అంటే అర్థం కూడా తెలియని వయసులో ఆ చిన్నారి చేసిన పనిని పలువురు నెటిజన్లు కొనియాడారు. చిన్న తనం నుంచే దేశభక్తిని తెలియచెబుతూ, ఇతరుల పట్ల గౌరవంగా ఉండేలా ఆ చిన్నారిని పెంచుతున్న తల్లిదండ్రులను అభినందించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని