Viral video: ఇలా చేస్తే.. 6 నెలల పాటు తాజాగా కరివేపాకు: వైరల్‌ వీడియో చూశారా..?

కరివేపాకులను 6 నెలల పాటు తాజాగా నిల్వ చేసేలా ఓ చిట్కా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 17 Jun 2024 16:42 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: తాజా కరివేపాకులను ఎక్కువ కాలం నిల్వ చేయడం కష్టమే. ఫ్రిజ్‌లో పెట్టినా కూడా కొద్ది రోజులకు రంగు మారడం, కుళ్లిపోతుంటాయి. అలాకాకుండా కరివేపాకు ఆరు నెలల వరకు తాజాగా ఉండాలంటే..! అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అందుకోసం సింపుల్‌ చిట్కా చెప్పారో నెటిజన్‌..! 

వీడియోలో ఆమె కరివేపాకును ఎలా తాజాగా ఉంచవచ్చో చెబుతూ.. రెమ్మ నుంచి తెంపిన కరివేపాకును శుభ్రం చేసిన అనంతరం ఒక ఖాళీ ఐస్ ట్రేని తీసుకొని అందులోని క్యూబ్‌లలో ఈ ఆకులను ఉంచారు. వాటిపై నీరు పోసి ఆకులు మునిగేలా సరిచేసి ఫ్రీజర్‌లో దాచారు. కరివేపాకులతో కూడిన నీరు ఐస్ క్యూబ్స్‌గా మారిన తర్వాత వాటిని బయటకు తీసి జిప్ లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో స్టోర్‌ చేశారు. కరివేపాకు అవసరం ఉన్నప్పుడు ఈ క్యూబ్స్‌ను తీసుకొని గోరు వెచ్చని నీటిలో వేసి తాజాగా ఉన్న కరివేపాకులను ఉపయోగించుకోవచ్చని ఆమె చూపించారు. ఈ చిట్కాతో తాజా కరివేపాకులను కనీసం 6 నెలల పాటు సులభంగా నిల్వ చేయవచ్చట.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఉద్యోగం చేసే మహిళలకు, విదేశాల్లో ఉండేవారికి ఇది అద్భుతమైన చిట్కాగా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని