Canada Singer: కెనడాతో ఉద్రిక్తతలు.. తన ఫేవరెట్ సింగర్‌ను అన్‌ఫాలో చేసిన కోహ్లీ..!
Canada Singer: భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ పంజాబీ సింగర్ నెట్టింట తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. సామాజిక మాధ్యమాల్లో అతడు చేసిన పోస్టులు ఈ విమర్శలకు కారణమయ్యాయి. ఎవరా సింగర్..? అసలేం జరిగిందంటే..?
ఇంటర్నెట్ డెస్క్: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ (India)కు సంబంధం ఉందంటూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. కెనడాలో ఉంటున్న ప్రముఖ భారత గాయకుడు శుభ్‌నీత్ సింగ్ (Rapper Shubhneet Singh) విమర్శల్లో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి ప్రముఖ క్రికెటర్లు అతడిని సామాజిక మాధ్యమాల్లో అన్‌ఫాలో చేశారు. అతడి భారత్ టూర్ కూడా రద్దయ్యింది.
ఎవరీ శుభ్..?
పంజాబ్‌కు చెందిన గాయకుడు, నటుడు రన్వీత్ సింగ్ సోదరుడైన 26 ఏళ్ల శుభ్‌నీత్ (Shubhneet Singh) కొన్నేళ్ల క్రితం కెనడా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అక్కడి నుంచే తన ర్యాప్ సింగింగ్ జర్నీని ప్రారంభించాడు. 2021లో అతడు ‘వి రోల్ ఇన్’ పేరుతో ఓ ఆల్బమ్ సాంగ్ విడుదల చేశాడు. అది ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందింది. కోట్ల మంది ఆ పాటను వీక్షించారు. ఆ తర్వాత ‘డోంట్ లుక్’ సాంగ్‌తో ర్యాప్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. దీంతో ‘స్టిల్ రోల్ ఇన్’ పేరుతో ర్యాప్ సింగర్‌గా తన తొలి భారత్ టూర్‌ను ఇటీవల ప్రకటించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ప్రదర్శనలిచ్చేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబరు 23-25 తేదీల్లో ముంబయిలో అతడు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
కెనడాలో అత్యంత జాగ్రత్తగా ఉండండి.. అక్కడి భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
‘ఖలిస్థానీ’ పోస్టులతో వివాదంలోకి..
అయితే శుభ్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఖలిస్థానీ ఉద్యమానికి అనుకూలంగా కొన్ని పోస్టులు చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని అభ్యంతకర ఫొటోలు పెట్టాడు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అతడి ప్రదర్శనను రద్దు చేయాలని ఇటీవల ముంబయిలో భాజపా యువజన విభాగం ఆందోళన చేపట్టింది.
అన్‌ఫాలో చేసిన క్రికెటర్లు..
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్స్‌కు శుభ్ ఆల్బమ్స్ అంటే చాలా ఇష్టం. అతడు తన ఫేవరెట్ ఆర్టిస్ట్ అని గతంలో ఓసారి కోహ్లీ చెప్పాడు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా తదితర క్రికెటర్లు కూడా శుభ్‌ను ఇన్‌స్టాలో ఫాలో అయ్యారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వీరంతా అతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లు తెలిసింది.
భారత పర్యటన రద్దు..
మరోవైపు, శుభ్ భారత్ టూర్ కోసం తాము ప్రకటించిన స్పాన్సర్‌షిప్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ ప్రకటించింది. అటు, శుభ్ భారత టూర్ కూడా రద్దయ్యింది. ఈ విషయాన్ని అతడికి స్పాన్సర్‌గా ఉన్న బుక్‌మైషో ట్విటర్ వేదికగా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
సరిహద్దులు సురక్షితంగా లేకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. -
Bomb threat: బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు (Bengaluru)లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విడతలుగా ఈ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. -
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
శ్రీనగర్ నిట్‌లో సోషల్ మీడియా దుమారం
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎన్ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. -
పల్లెటూరి మేడం యూట్యూబ్ ఆంగ్ల పాఠాలు అదుర్స్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబీ జిల్లా సిరాథూ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విశేష ఆదరణ చూరగొంటోంది. -
Gated community: గేటెడ్ కమ్యూనిటీ రోడ్లపై ఎవరైనా వెళ్లవచ్చు!
గేటెడ్ కమ్యూనిటీల్లోని రహదారులపై బయటి వారు కూడా రాకపోకలు సాగించవచ్చని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సిల్క్యారాలోనా.. సొంత ఊళ్లకా!
మృత్యువు అంచువరకు వెళ్లి రెండ్రోజుల క్రితం క్షేమంగా తిరిగివచ్చిన సిల్క్యారా సొరంగ కార్మికులు ఇప్పుడు అక్కడే ఉండి ఎప్పటిలా పనిచేసుకోవాలా, సొంత ఊళ్లకు వెళ్లిపోవాలా అనే ఊగిసలాటలో ఉన్నారు. -
నా దృష్టిలో పెద్దకులాలు ఆ నాలుగే
‘నా దృష్టిలో నాలుగు పెద్ద కులాలవారంటే పేదలు, యువత, మహిళలు, రైతులు. వారి ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) కనిపించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) సుశాంత నందొ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరాలు వెల్లడించారు. -
కన్నూర్ వర్సిటీ వీసీగా రవీంద్రన్ పునర్నియామకం కొట్టివేత
కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ ఉప కులపతి (వైస్‌ఛాన్సలర్/వీసీ)గా గోపీనాథ్ రవీంద్రన్ పునర్నియామకాన్ని సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. -
విమానంలో నీటి ధార
విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి ఏర్పడిన నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బంది పడిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. -
శోమాకాంతి సేన్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు శోమాకాంతి సేన్ ఆరోగ్య కారణాలతో సుప్రీంకోర్టులో పెట్టుకున్న మధ్యంతర బెయిల్ అభ్యర్థన పిటిషన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గట్టిగా గురువారం వ్యతిరేకించింది. -
నాడు భారత్‌ను ద్వేషించి.. నేడు ప్రేమించి..!
అమెరికా భద్రతా సలహదారుడిగా, విదేశాంగ మంత్రిగా హెన్రీ కిసింజర్ 70వ దశకంలో తీవ్ర భారత్ వ్యతిరేకవైఖరిని అవలంబించారు. పాకిస్థాన్‌తో మాత్రం సత్సంబంధాలు కొనసాగించారు. -
కుర్చీ పట్టుకోమ్మా.. లేదా ఆమె కూర్చుంటుంది: మోదీ
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కువమందికి చేర్చడానికి ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’లో భాగంగా వివిధ స్కీంల లబ్ధిదారులను ఉద్దేశించి గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. -
సాధ్యమైనంత త్వరగా తదుపరి విడత సైనిక చర్చలు
తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణను పూర్తిచేయడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై భారత్, చైనాలు గురువారం దౌత్యపరమైన చర్చలు జరిపాయి. -
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ రేపు
ఈ నెల 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. -
జ్ఞానవాపి సర్వే నివేదిక సమర్పణకు 10 రోజుల గడువు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీలో జ్ఞానవాపి మసీదు ఆవరణలో భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) నిర్వహించిన సర్వే నివేదిక తయారీ, సమర్పణకు వారణాసి జిల్లా కోర్టు మరో 10 రోజుల గడువిచ్చింది. -
వాయు కాలుష్యంతో భారత్‌లో ఏటా 21 లక్షల మంది బలి
ఆరుబయట చోటుచేసుకుంటున్న వాయు కాలుష్యం వల్ల భారత్‌లో ఏటా 21.8 లక్షల మంది బలవుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
న్యాయాధికారులకు గౌరవప్రదమైన సౌకర్యాలు
న్యాయాధికారులకు గౌరవప్రదమైన సౌకర్యాలు, పని వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. -
లోక్‌సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలం పొడిగింపు
లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
సిల్క్యారా కార్మికులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
సిల్క్యారా సొరంగం నుంచి బయటకు వచ్చిన 41 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను చెక్కుల రూపంలో అందించినట్లు ఈ పనులు చేపట్టిన ‘నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్’ తెలిపింది.


తాజా వార్తలు (Latest News)
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్‌బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి