వర్షం అతడికి బంపర్‌ ప్రైజ్‌ తెచ్చిపెట్టింది!

సాధారణంగా భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోతుంది. ప్రజలు ఇక్కట్లు పడుతుంటారు. పంటలు, ఇళ్లు కోల్పోయి ఆర్థికంగానూ దెబ్బతింటూ.......

Published : 19 Aug 2020 19:34 IST

వాషింగ్టన్‌: సాధారణంగా భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోతుంది. ప్రజలు ఇక్కట్లు పడుతుంటారు. పంటలు, ఇళ్లు కోల్పోయి ఆర్థికంగానూ దెబ్బతింటూ ఉంటారు. కానీ, యూఎస్‌లోని వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తికి అదే వర్షం అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వర్షంలో తడవకూడదని ఓ షాపులోకి వెళ్లిన ఆ వ్యక్తి.. భారీ మొత్తంలో నగదు సొంతం చేసుకున్నాడు. అదెలాగంటే..?

పీటర్స్‌బర్గ్‌లో ఉండే గార్లండ్‌ హ్యారీసన్‌ ఇటీవల బయటకు వెళ్తుండగా అనుకోకుండా భారీ వర్షం కురిసిందట. వర్షం నుంచి తప్పించుకోవడం కోసం హ్యారీసన్‌ స్థానిక షాపింగ్‌మాల్‌లోకి వెళ్లాడు. ఎలాగు షాప్‌కు వచ్చాం కదా అని సరదాకి ఓ లాటరీ టికెట్‌ కొనుగోలు చేశాడు. వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే తను కొన్న లాటరీ టికెట్‌కు 1,58,377 డాలర్లు (దాదాపు రూ.కోటి 18లక్షలు) నగదు బహుమతి వచ్చింది. వెంటనే లాటరీ అధికారులకు సమాచారం ఇచ్చి నగదును తెచ్చుకున్నాడు. ఆకస్మాత్తుగా లభించిన ఇంత డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని హ్యారీసన్‌ తెలిపాడు. అదృష్టం అంటే అతడిదే కదా..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని