‘మీరు లేకుండా మేం మెరుగ్గా ఉన్నాం’.. బెంగాల్ సీఎంపై వర్సిటీ తీవ్ర వ్యాఖ్యలు..!
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)ని ఉద్దేశిస్తూ.. విశ్వభారతి విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. దానిలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కోల్‌కతా: విశ్వభారతి విశ్వవిద్యాలయం(Visva Bharati University) భూవివాదం రాజకీయ విమర్శలకు దారితీసింది. ఇటీవల పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కు పత్రాలు నోబెల్ గ్రహీత అమర్త్యసేన్(Amartya Sen)కు అందించగా.. తాజాగా సీఎంను విమర్శిస్తూ విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘విశ్వభారతి కేంద్ర విశ్వవిద్యాలయం. మీ ఆశీర్వాదం లేకుండా మేం మెరుగైన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మేం ప్రధాన మంత్రి మార్గదర్శనంలో ఉన్నాం’ అని ఆ ప్రకటనలో వెల్లడించింది.
విశ్వవిద్యాలయంలో ఆక్రమించిన భూమిని తక్షణమే అప్పజెప్పాలని సేన్‌కు విశ్వభారతి నుంచి ఇటీవల వరుసగా లేఖలు వెళ్లాయి. ‘‘మీరు నివాసం ఉంటున్న భూమి విస్తీర్ణం 1.38 ఎకరాలు. చట్టపరంగా మీ భూమి 1.25 ఎకరాలు మాత్రమే. ఆక్రమించిన భూమిని తక్షణమే తిరిగి ఇచ్చేయండి లేదా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని లేఖలో తెలిపింది. ఈ లేఖలకు ఆయన స్పందిస్తూ.. నిజం ఏంటో, అబద్ధం ఏంటో గ్రహించలేని వ్యక్తి వైస్ ఛాన్సలర్ బాధ్యతల్లో ఉండటం బాధాకరమని విశ్వభారతి ఉపకులపతిని ఉద్దేశించి అన్నారు. మీ వైఖరి వెనక ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో ఇటీవల మమత ఆ భూ యాజమాన్యహక్కు పత్రాలను సేన్‌కు అప్పగించారు. ఇకపై ఈ విషయంలో ఆయన్ను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. ‘‘అమర్త్యసేన్ భూఆక్రమణ చేశారనేది నిరాధారమైన ఆరోపణ. ఆయన ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన్ను కించపరిచే హక్కు ఎవరికీ లేదు. విశ్వభారతిని కాషాయీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నాను’’ అని దీదీ అన్నారు. సేన్ ఎలాంటి భూఆక్రమణకు పాల్పడలేదని.. అన్ని రికార్డులు పరిశీలించామన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS High court: జూనియర్ లెక్చరర్ పరీక్షపై టీఎస్పీఎస్సీ నిర్ణయం సరికాదు: హైకోర్టు
-
World News
Iran: ఇరాన్-సౌదీ బంధంలో మరో ముందడుగు
-
Politics News
Rahul Gandhi:యువతకు 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. ₹3వేలు నిరుద్యోగ భృతి: రాహుల్ హామీ
-
Sports News
IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు.. భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష
-
India News
Khalistan: ఆగని ఖలిస్థానీ అనుకూలవాదుల దాడులు.. నిన్న లండన్.. నేడు శాన్ఫ్రాన్సిస్కో
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు