Kiren Rijiju: కేంద్ర మంత్రి నృత్యం.. మెచ్చుకున్న ప్రధాని

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సంప్రదాయ నృత్యంతో అలరించారు. అభివృద్ధి పనులను పరిశీలించేందుకు బుధవారం ఆయన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కజలాంగ్ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి ‘సాజొలాంగ్‌’ ప్రజలు ఆయనకు జానపద గీతాలు, సంప్రదాయ...

Published : 30 Sep 2021 17:32 IST

ఇటానగర్‌: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సంప్రదాయ నృత్యంతో అలరించారు. అభివృద్ధి పనులను పరిశీలించేందుకు బుధవారం ఆయన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కజలాంగ్ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి ‘సాజొలాంగ్‌’ ప్రజలు ఆయనకు జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన సైతం లయబద్ధంగా నృత్యం చేశారు. సంప్రదాయ వాయిద్యాలు, గ్రామస్థుల చప్పట్లు, కేరింతల నడుమ ఉల్లాసంగా అడుగులు కదిపారు. అనంతరం ఈ వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి అందమైన కజలాంగ్ గ్రామానికి వెళ్లా. ఎవరైనా అతిథులు తమ గ్రామాన్ని సందర్శించినప్పుడల్లా సాజోలాంగ్ ప్రజల ఆనందం ఇది. ఇక్కడి జానపద పాటలు, నృత్యాలు.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి’ అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియో ట్వీట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మంచి డ్యాన్సర్‌! అరుణాచల్‌ ప్రదేశ్‌ అద్భుతమైన సంస్కృతిని చూడటం బాగుంది’ అని ట్వీట్‌ చేశారు. నెటిజన్లు సైతం రిజిజును కొనియాడుతూ.. కామెంట్లు పెడుతున్నారు. అరుణాచల్ పశ్చిమ స్థానం నుంచి ఎంపీగా ఉన్న రిజిజు..  సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ సంబంధిత వీడియోలను పోస్ట్‌ చేస్తుంటారు. ఇటీవల ఆయన ఓ బాలీవుడ్‌ గీతాన్ని పాడి అదరగొట్టిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని