Delhi: పొంగి పొర్లుతున్న యమునానది!

భారీ వర్షాల కారణంగా దిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం నదిలో

Published : 30 Jul 2021 23:51 IST

దిల్లీ: భారీ వర్షాల కారణంగా దిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం నదిలో నీటిమట్టం గరిష్ఠంగా 205.33 మీటర్లకు చేరువవుతోందని దిల్లీ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. నీటిమట్టం 204.50 మీటర్ల స్థాయిని తాకగానే ప్రమాద హెచ్చరికలను జారీ చేసినట్లు వెల్లడించారు. వరద ఉద్ధృతి అధికమవుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఎగువ ప్రాంతం  హరియాణాలోని హత్నీకుంద్‌ బ్యారేజ్‌ నుంచి నదిలోకి నీటిని విడుదల చేయడం ద్వారా ప్రవాహ ఉద్ధృతి వేగం పెరిగిందన్నారు. కాగా యమునానదిలో ఇప్పటివరకూ 2013లో గరిష్టంగా 207.49 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని