బ్రెజిల్‌లో పేలిన నీటి పైప్‌లైన్‌

బ్రెజిల్‌లోని సియారా రాష్ట్రంలోని జటి ఆనకట్టకు నీటిని ఎత్తిపోసే పైపులైన్‌ పేలి కొన్ని మీటర్ల ఎత్తులో నీరు ఎగిసి పడింది. భారీ స్థాయిలో పేలుడు సంభవించడంతో అప్రమత్తమైన అధికారులు 2వేల మంది స్థానికులకు సురక్షిత ప్రాంతాలకు....

Published : 23 Aug 2020 11:40 IST

సియారా: బ్రెజిల్‌లోని సియారా రాష్ట్రంలోని జటి ఆనకట్టకు నీటిని ఎత్తిపోసే పైపులైన్‌ పేలి కొన్ని మీటర్ల ఎత్తులో నీరు ఎగిసి పడింది. భారీ స్థాయిలో పేలుడు సంభవించడంతో అప్రమత్తమైన అధికారులు 2వేల మంది స్థానికులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సావో ఫ్రాన్సిస్కో  నది నుంచి నీటిని జటి ఆనకట్టకు తరలించడానికి ఈ పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఆనకట్టను బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారో జూన్‌లో ప్రారంభించారు. పేలుడు కారణంగా ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని