BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ను కాంగ్రెస్సే నాశనం చేసింది.. మేం పునరుద్ధరిస్తున్నాం: నిర్మలా సీతారామన్‌

భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఎంటీఎన్‌ఎల్‌)ను గాలికొదిలేసి.. వొడాఫోన్‌లాంటి ప్రైవేటు సంస్థలకు సాయం చేస్తోందని శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌ ఆరోపించారు.

Published : 09 Feb 2022 15:06 IST

దిల్లీ: భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఎంటీఎన్‌ఎల్‌)ను గాలికొదిలేసి.. వొడాఫోన్‌లాంటి ప్రైవేటు సంస్థలకు సాయం చేస్తోందని శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌ ఆరోపించారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో స్పందించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ను గత కాంగ్రెస్‌ ప్రభుత్వమే నాశనం చేసిందని.. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తోందని చెప్పారు. 

‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుతో బీఎస్‌ఎన్‌ఎల్‌ గత పదేళ్లలో సర్వం కోల్పోయింది. 2జీ స్పెక్ట్రమ్‌లో జరిగిన అవినీతి కారణంగా బీఎస్‌ఎన్‌ఎల్‌., టెలికాం రంగంలో బలంగా నిలబడలేకపోయింది. ఎన్డీయే ప్రభుత్వ అధికారంలోకి వచ్చే సమయానికి ఈ సంస్థ పరిస్థితి దారుణంగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. దీంతో మా ప్రభుత్వం ఆ సంస్థకి నిధులు సమకూర్చి.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బాకీలను తీర్చేలా చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ అనేది మన వ్యూహాత్మక ఆస్తుల్లో ఒక భాగం. అందుకే, సంస్థను పునరుద్ధరిస్తున్నాం. టెలికాం రంగంలో ఇతర కంపెనీలతో పోటీ పడేలా 4జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసేందుకు కేంద్రం బీఎస్‌ఎన్‌ఎల్‌కు నిధులు కేటాయిస్తోంది’’అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని