Pakistan: దేశాన్ని నడిపించేంత డబ్బు మా దగ్గర లేదు: ఇమ్రాన్‌ ఖాన్‌

ప్రపంచదేశాల ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖానే స్వయంగా వెల్లడించారు. మంగళవారం ఇస్లామాబాద్‌లోని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ రెవెన్యూలో ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ సిస్టమ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన

Published : 25 Nov 2021 01:52 IST

ఇస్లామాబాద్‌: ప్రపంచదేశాల ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖానే స్వయంగా వెల్లడించారు. మంగళవారం ఇస్లామాబాద్‌లోని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ రెవెన్యూలో ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ సిస్టమ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ.. ‘మన దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. దేశాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన ధనం మన వద్ద లేకపోవడమే. అందుకే అప్పులు చేయాల్సి వస్తోంది’’అని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. 

అప్పుల భారం పెరిగిపోతుండటం.. దేశంలో పన్నులు సరిగా వసూలు కాకపోవడం ‘జాతీయ భద్రత’ అంశంగా మారిందని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. గత ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఆర్థిక వనరులు లేకపోవడంతో ప్రజా సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల్లో ప్రభుత్వం 3.8బిలియన్‌ డాలర్లు అప్పు చేసిందని తెలిపారు. ఈ అప్పుల ఊబి నుంచి పాకిస్థాన్‌ బయటపడాలంటే ప్రజలు పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 

పాక్‌లో 22కోట్ల జనాభా ఉంటే.. అందులో కేవలం 30లక్షల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక సలహాదారు షౌకత్‌ టరిన్‌ గతంలో వెల్లడించారు. వారిలో 15లక్షల మందికి పన్నులు వెంటనే చెల్లించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులు కూడా జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని