ఆ మాత్రం తెలివి తేటలు మాకున్నాయి: చైనా

భారత్‌-చైనా సరిహద్దు వివాదం పరిష్కారానికి మరొకరి జోక్యం అవసరం లేదని భారత్‌లో చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌ అన్నారు. ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారు. ప్రాంతంతో సంబంధం లేని శక్తుల ప్రవేశం వల్లే దక్షిణ చైనా ...

Updated : 24 Jul 2020 20:20 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: భారత్‌-చైనా సరిహద్దు వివాదం పరిష్కారానికి మరొకరి జోక్యం అవసరం లేదని భారత్‌లో చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌ అన్నారు. ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారు. ప్రాంతంతో సంబంధం లేని శక్తుల ప్రవేశం వల్లే దక్షిణ చైనా సముద్రం వద్ద అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన వరుస ట్వీట్లు చేశారు.

చైనా దుందుడుకు వైఖరి వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని భారత్‌లో బ్రిటన్‌ రాయబారి ఫిలిప్‌ బార్టన్‌ గురువారం అన్నారు. భారత్‌-చైనా సరిహద్దు వివాదం, హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛపై కీలకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇక్కడికి పోస్టింగ్‌ ఇచ్చాక తొలిసారి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు.

‘బ్రిటిష్‌ హై కమిషనర్‌ చేసిన ఆరోపణలు అవాస్తవం. భారత్‌-చైనా సరిహద్దు వివాదం ద్వైపాక్షిక అంశం. విభేదాలను పరిష్కరించుకొనే సామర్థ్యం, విజ్ఞానం మాకున్నాయి. మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు’ అని సన్‌ వీడాంగ్‌ అన్నారు. ‘ప్రాదేశిక ప్రాంతం, సముద్ర జలాల వివాదంలో సంబంధం లేని శక్తుల జోక్యంతోనే దక్షిణ చైనా సముద్రం వద్ద అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక హాంకాంగ్‌ వ్యవహారంలో విదేశీయుల జోక్యాన్ని చైనా అంగీకరించదు’ అని ఆయన వరుస ట్వీట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని