
Lakhimpur Violence: లఖింపుర్ ఘటన.. ఆశిష్ బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించాం: యూపీ ప్రభుత్వం
దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నేడు తమ స్పందనను కోర్టుకు అందించింది. ఆశిష్‌కు బెయిల్ ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామని యూపీ సర్కారు వెల్లడించింది. అంతేగాక, ఈ కేసులో సాక్షులకు తగిన భద్రత కల్పిస్తున్నట్లు తెలిపింది.
‘‘అలహాబాద్ హైకోర్టులో ఆశిష్ మిశ్రా బెయిల్‌ను యూపీ ప్రభుత్వం వ్యతిరేకించలేదంటూ లఖింపుర్ బాధిత కుటుంబాలు చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. అతడి బెయిల్ దరఖాస్తును మేం తీవ్రంగా వ్యతిరేకించాం. బెయిల్‌కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేసే అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు’’ అని యూపీ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
ఈ సందర్భంగా లఖింపుర్ ఘటనలో సాక్ష్యులపై దాడి జరిగినట్లు వస్తోన్న వార్తలను కూడా యూపీ ప్రభుత్వం ఖండించింది. ‘‘తమపై దాడి జరిగినట్లు లఖింపుర్ ఘటన సాక్షులు చెప్పలేదు. ఈ ఘటనలో బాధితులు, సాక్షుల కుటుంబాలకు నిరంతర భద్రత కల్పిస్తున్నాం. సాక్ష్యులకు సాయుధ సిబ్బందిని రక్షణ కల్పిస్తున్నాం’’ అని ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు లఖింపుర్ ఖేరి ఘటనలో గత నెల అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అంతేగాక, ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారంటూ ఆరోపించాయి. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ యూపీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నేడు కోర్టుకు స్పందన తెలియజేసింది. ఆశిష్ బెయిల్‌పై సుప్రీంకోర్టు రేపు(మార్చి 30) మరోసారి విచారణ జరపనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Prepaid Plan: ₹1000తో డైలీ 3జీబీ డేటా..180 రోజుల వ్యాలిడిటీ..దేంట్లో తెలుసా?
-
Sports News
Cricket Records : RRR.. సరసన చేరేదెవరు?
-
Politics News
Maharashtra: గవర్నర్.. రఫేల్ జెట్ కంటే వేగంగా ఉన్నారే..!
-
General News
AB Venkateswarlu: కొంత మంది వ్యక్తులు.. కొన్ని శక్తులు నన్ను టార్గెట్ చేస్తున్నాయి: ఏబీవీ
-
Politics News
Maharashtra: బలపరీక్షపై సుప్రీంకు ఠాక్రే సర్కారు.. సాయంత్రం 5 గంటలకు విచారణ
-
World News
Afghanistan Earthquake: ఆదరించిన కుటుంబం మరణించిందని తెలియక..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)