Afghanistan: ‘తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా.. అఫ్గాన్‌ను ఆదుకోవాలి’

అఫ్గాన్‌ తాలిబాన్ల వశమైన నేపథ్యంలో.. స్థానికంగా పౌరుల జీవనం, వారి హక్కుల విషయంలో ఆయా దేశాలు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ ఈ వ్యవహారంపై..

Published : 16 Aug 2021 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గాన్‌ తాలిబన్ల వశమైన నేపథ్యంలో.. స్థానికంగా పౌరుల జీవనం, వారి హక్కుల విషయంలో ఆయా దేశాలు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. ‘తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను నియంత్రణలో తీసుకున్న విషయం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యా. అక్కడి మహిళలు, మైనారిటీలు, మానవ హక్కుల కార్యకర్తల విషయమై తీవ్ర ఆందోళన చెందుతున్నా. ప్రపంచ దేశాలు, స్థానిక సంస్థలు.. తక్షణమే కాల్పుల విరమణకు పిలుపునివ్వాలి. మానవతా దృక్పథంతో అక్కడున్న వారికి సహాయం అందించాలి. పౌరులు, శరణార్థులను రక్షించాల’ని ట్వీట్‌ చేశారు. తాలిబన్లు ఆదివారం దేశ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని