ఆలయాలకు స్వేచ్ఛనిచ్చే చట్టం తీసుకొస్తాం: కర్ణాటక సీఎం

దేశంలోని అనేక ఆలయాలు ఆయా రాష్ట్రాల్లోని దేవదాయశాఖ పరిధిలోకి వస్తాయి. అయితే, తమ ఆధీనం నుంచి ఆలయాలకు విముక్తి కలిగించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలపై ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేస్తూ కొత్త చట్టం తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర

Published : 30 Dec 2021 21:43 IST

బెంగళూరు: దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం ఆలయాలు రాష్ట్రాల్లోని దేవాదాయశాఖ పరిధిలోకి వస్తాయి. అయితే, తమ అధీనం నుంచి ఆలయాలకు విముక్తి కలిగించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేస్తూ కొత్త చట్టం తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. 

‘‘ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు వేర్వేరు చట్టాల పరిధిలో సురక్షితంగా ఉన్నాయి. కానీ, హిందూ ఆలయాలు ప్రభుత్వ నియంత్రణతో, ఆంక్షల చట్రంలో చిక్కుకున్నాయి. ఈ విషయాన్ని కొందరు పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ నిర్వహణ విషయంలో స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. అందుకే, ప్రభుత్వ చట్టాల నుంచి ఆలయాలను విముక్తి కలిగేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాం. బడ్జెట్ సమావేశాలకు ముందే మా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువస్తుంది. ఆలయాలను ఆలయ బోర్డులు స్వతంత్రంగా నిర్వహించుకోగలవని విశ్వసిస్తున్నా’’ అని సీఎం బొమ్మై తెలిపారు.

ఇప్పటికే కర్ణాటక సర్కార్‌.. మతమార్పిడిని అడ్డుకునేందుకు ‘కర్ణాటక ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్‌ టు ఫ్రీడమ్‌ ఆఫ్ రిలీజియన్‌ బిల్లు, 2021’ను ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి ఇటీవల శాసనసభ్యులు ఆమోదం తెలిపారు. శాసన మండలి ఆమోదం కూడా లభిస్తే.. త్వరలోనే ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని