
Updated : 10 Oct 2021 10:18 IST
Taliban: ఐసిస్ పనులు తలనొప్పిగా మారాయి: తాలిబన్లు
కాబుల్: అఫ్గాన్‌లోని ఐసిస్ ఉగ్రవాదులను త్వరలోనే అణిచివేస్తామని తాలిబన్లు ప్రకటించారు. తమ దేశానికి ఐసిస్ నుంచి ముప్పు పొంచి ఉందనే వాదనలను తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కొట్టిపారేశారు. తమ భూభాగంలో కొన్ని చోట్ల ఐసిస్ చేస్తున్న పనులు తమకు తలనొప్పిగా మారాయన్నారు. ఆ ఘటనలు జరిగిన వెంటనే వారిని తరిమికొట్టినట్టు తెలిపారు. మరోవైపు, కాబుల్ శివారులో ఐసిస్ ఖొరసాన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను కాల్చివేసినట్టు అఫ్గానిస్థాన్ మీడియా తెలిపింది. ఐసిస్ స్థావరాలను ధ్వంసం చేసేందుకు ముమ్మర ఆపరేషన్ చేపట్టినట్టు పేర్కొంది. ఇటీవల కాబుల్ మసీదు వద్ద జబిహుల్లా ముజాహిద్ తల్లి సంస్మరణ కార్యక్రమంలో ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల అనంతరం ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేతను తాలిబన్లు ప్రారంభించారు.
ఇవీ చదవండి
Tags :