Punjab: ‘వాస్తవాలను నిర్ధారించుకోవాల్సి ఉంది’.. మాన్‌ వ్యవహారంపై కేంద్ర మంత్రి సింధియా

ఫూటుగా తాగి ఉండటంతో పంజాబ్‌(Punjab) ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(Bhagwant Mann)ను జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో విమానం నుంచి దించేశారని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా....

Updated : 21 Sep 2022 00:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫూటుగా తాగి ఉండటంతో పంజాబ్‌(Punjab) సీఎం భగవంత్‌ మాన్‌(Bhagwant Mann)ను జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో విమానం నుంచి దించేశారని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారణ చేపట్టాలంటూ డిమాండ్లూ వచ్చాయి. దీనిపై పౌరవిమానయానశాఖ(Civil aviation ministry) మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ వ్యవహారం విదేశీ భూభాగంపై చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు అందజేయడం విమానయాన సంస్థ ‘లుఫ్తాన్సా(Lufthansa)’పై ఆధారపడి ఉంటుంది. నాకు వచ్చిన అభ్యర్థనల ఆధారంగా.. దాన్ని పరిశీలిస్తా’ అని అన్నారు.

‘తప్పతాగి నడవలేని స్థితిలో ఉండటంతో మాన్‌ను ఫ్రాంక్‌ఫర్ట్‌లో లుఫ్తాన్సా విమానం నుంచి దించేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం కారణంగా విమానం 4 గంటలు ఆలస్యమైంది. దీంతో ఆయన ఆప్‌ జాతీయ సదస్సుకు హాజరుకాలేదు. ఈ విషయంపై  కేంద్రం జోక్యం చేసుకుని నిజానిజాలను బయటపెట్టాలి’ అని శిరోమణి అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ సోమవారం డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ సైతం కోరింది. అయితే, ఈ ఆరోపణలను ఆప్‌ ఖండించింది. మరోవైపు.. ఫ్రాంక్‌ఫర్ట్‌కు రావాల్సిన ఒక విమానం ఆలస్యం కావడం, ఎయిర్‌క్రాఫ్ట్‌ మారాల్సి రావడం వల్లే దిల్లీ ఫ్లైట్‌ బయలుదేరడంలో 4 గంటలు జాప్యం జరిగిందని లుఫ్తాన్సా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని