Corona virus: గాలిలో కరోనా 20 నిమిషాలుంటే..

అధిక ఉష్ణోగ్రతల్లో, పొడి వాతావరణంలో వైరస్‌లు ఎక్కువసేపు మనుగడ సాగించలేవని తాజా అధ్యయనంలో నిపుణులు మరోసారి తేల్చారు! ప్రస్తుతం ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారిన కరోనా వైరస్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదని

Updated : 14 Jan 2022 07:18 IST

90% తగ్గుతున్న సంక్రమణ సామర్థ్యం

దిల్లీ: అధిక ఉష్ణోగ్రతల్లో, పొడి వాతావరణంలో వైరస్‌లు ఎక్కువసేపు మనుగడ సాగించలేవని తాజా అధ్యయనంలో నిపుణులు మరోసారి తేల్చారు! ప్రస్తుతం ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారిన కరోనా వైరస్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదని స్పష్టం చేశారు. తక్కువ ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన వాతావరణం మాత్రం వైరస్‌లకు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయంలో ఏరోసోల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా వైరస్‌ గాలిలో ఉంటే.. దాని సంక్రమణ సామర్థ్యం కేవలం 20 నిమిషాల్లో 90% మేర నశిస్తుందని వారు తేల్చారు. అందులోనూ ఎక్కువ నష్టం తొలి 5 నిమిషాల్లోనే చోటుచేసుకుంటున్నట్లు గుర్తించారు. మరోవైపు- ఆర్ధ్రత 40% కంటే తక్కువగా ఉన్న వాతావరణంలో.. వైరస్‌లు తమ సంక్రమణ సామర్థ్యంలో దాదాపు 50 శాతాన్ని కేవలం 5-10 సెకన్ల వ్యవధిలోనే కోల్పోతున్నాయని కూడా నిపుణులు నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని